హైదరాబాద్‌లో ఇక అర్ధరాత్రి వరకూ షాపులు

ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి శుభవార్త

హైదరాబాద్ లో రాత్రివేళలో హోటళ్ల సమయంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. అర్ధరాత్రి 1 గంట వరకు, మద్యం షాపులు తప్ప మిగతా ఏ వ్యాపారమైనా నడిపించుకోవచ్చని తెలిపారు. వైన్ షాపులకు ఈ అవకాశం ఇస్తే విచ్చలవిడిగా తాగే అవకాశం ఉందని, అందుకే దాన్ని మినహాయిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా రా. 11 గంటలకే రెస్టారెంట్లు, హోటళ్లు మూసివేయడంతో ఇబ్బంది అవుతోందని పలువురు సీఎం దృష్టికి తేవడంతో రేవంత్ ఈ ప్రకటన చేశారు.