– వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
విజయవాడ: వ్యవసాయశాఖ,పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తమ నివాసంలో వ్యవసాయ,పశుసంవర్ధక,మత్స్య,మార్కెటింగ్,సహకార మరియు పాడి పరిశ్రమ శాఖల ఉన్నత అధికారులుతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేదితో ఖరీఫ్ సీజన్ సమీపించిన తరుణంలో విత్తనాలు మరియు ఎరువులు కొరత రాకూడదని,పంటలకు నాణ్యమైన పురుగులు మందులు అందించాలని,ఈ నెల 18 న రైతన్నలకు అందించబోయే కిసాన్ తదితర అంశాలపై చర్చిస్తూ ప్రతీ అధికారి రైతులకు అందుబాటులో ఉండాలని సూచించారు.