Mahanaadu-Logo-PNG-Large

మోదీ సుద్దులు మేం వినాలా?

-మోదీ సుద్దులు మేం వినాలా?
-బీజేపీ,టీడీపీ-జనసేన ముగ్గురూ తోడుదొంగలే
-కూటమి పసలేని ఆరోపణలకు ఈసీ వత్తాసా?!
-ముగ్గురూ తోడు దొంగలే
-ఆయనొచ్చి మాకు శుద్ధులు చెప్తాడా?
-ఇంత దిగజారిపోయి మాట్లాడే వ్యక్తిని ఎప్పుడూ చూడలేదు
-పేదల కడుపుకొట్టే నిర్ణయాలా?
-కూటమికి ఎన్నికల సంఘం వత్తాసు
-ఏ ఫిర్యాదు చేసినా వెంటనే స్పందన!
-ఈసీ ఎందుకలా వ్యవహరిస్తోంది?
-కూటమి.. ఓ తోడు దొంగల కూటమి
-కూటమి స్క్రిప్ట్‌ను ప్రధాని చదివేస్తున్నారు
-ప్రధాని మాటలకు ఒక పవిత్రత ఉండాలి
– ప్రధాని మోదీపై మంత్రి బొత్స ఎదురుదాడి

విశాఖపట్నం: ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం, ఆ పార్టీ అధినేత చంద్రబాబుతో కలిసిన కూటమి ఆలోచనలు ఎంతో నీచంగా, దుర్మార్గంగా, మానవత్వం లేకుండా ఉన్నాయి. కూటమి ఫిర్యాదు చేస్తే తానా అంటే తందాన అన్నట్లు ఎన్నికల కమిషన్‌ వ్యవహరిస్తోంది. ఎన్నికల నిబంధనలకు, రాజ్యాంగానికి మేము వ్యతిరేకం కాదు. కానీ వాస్తవాలను పరిశీలించాలి. అంతే కానీ.. వాళ్లు ఫిర్యాదు ఇస్తే.. దాని వల్ల సమజానికి, వ్యక్తులకు, వ్యవస్థను నష్టమా అనేది ఆలోచించకుండా వాళ్ల చావులకు కారణం అవ్వడం భావ్యమా? గౌరవంగా మహిళలు బతకాలని ఇస్తున్న చేయూత కార్యక్రమాన్ని ఆపడానికి ఎవరిది బాధ్యత? వీటన్నిటి కూటమి బాధ్యత కాదా? ఎన్నికల కమిషన్‌ బాధ్యత కాదా? అందుకే నిన్న ముఖ్యమంత్రి గారు సజావుగా ఎన్నికలు జరుగుతాయా లేదా అనే అనుమానం వ్యక్తం చేశారు.

దీనిపై కొన్ని సంస్థలు హైకోర్టుకు వెళ్లాయి. అవసరమైతే ప్రభుత్వం కూడా వెళ్తుంది. మోడీ చెప్పినా..ఇంకెవరు చెప్పినా..కూటమి గెలిచే అవకాశాలు ఎక్కడున్నాయి ఈసీని తమ చెప్పుచేతల్లో పెట్టుకుని ఆడించడం ధర్మం కాదు. మోడీ ఎవరో చెప్పింది మాట్లాడతారు. ముగ్గురూ తోడు దొంగలే. ఒక దొంగ మరొక దొంగకు సహకరించుకుంటున్నారు.

ఈ తోడు దొంగల కూటమి ఏ స్క్రిప్ట్‌ ఇస్తే ఆది చదివేసి వెళ్తారు..అంతే! వీళ్లా మా గురించి మాట్లాడేది? ఆయనొచ్చి మాకు శుద్ధులు చెప్తాడా? ఆయన అదే నోటితో చంద్రబాబు పోలవరాన్ని ఏటీఎంగా వాడుకున్నాడని చెప్పాడుగా? ఇప్పుడు మర్చిపోయాడా? ఏ పార్టీతో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా మాట్లాడటమేనా? ఆ పదవికి విలువ తీసేస్తున్నారు. ప్రధాన మంత్రి మాటలంటే దానికి ఒక పవిత్రత ఉండాలి. ఈ దేశంలో ఎంతో మంది ప్రధానిమంత్రులుగా చేశారు. ఇంత దిగజారిపోయి మాట్లాడే వ్యక్తిని ఎప్పుడూ చూడలేదు.

పోలవరంలో అవినీతి జరిగిందంటే, విచారణ చేయించుకోవచ్చుగా? పోలవరానికి ప్రధానమంత్రి.. రూ.15 వేల కోట్లకు ఈసీలు ఇవ్వకుండానే నిధులు విడుదల చేశారా? అందులో అవినీతి జరిగింది అనే అనుమానం వస్తే తన టీంను పంపి విచారణ చేయించవచ్చు కదా? ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి అంత వేక్‌గా మాట్లాడకూడదు కదా?