పారిస్‌ ఒలింపిక్స్‌ నుంచి సింధు నిష్క్రమణ

పారిస్‌, మహానాడు: పారిస్‌ ఒలింపిక్స్‌లో ఏదొక పతకం సాధిస్తుందని పి.వి సింధుపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ఈసారి హ్యాట్రిక్‌ కొడుతుందని అంతా ఊహించారు. కానీ సింధు ఓడిరది. పోరాడి ఓడిరది. క్వార్టర్స్‌ చేరు కుండానే ఒలింపిక్స్‌ నుంచి ఇంటి బాటపట్టింది.  బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌ లో ఆమె 19-21, 14-21తో చైనా క్రీడాకారిణి హే బిన్‌ జియావో చేతిలో ఘోరంగా ఓడిరది. తొలిగేమ్‌ ను గెలిచే ఛాన్స్‌ సింధు చేజార్చుకుంది. ఆ తర్వాత ముందుకు సాగలేక పొఇంది.మ్యాచ్‌ ఆరంభంలో 1-5 తేడాతో వెనకబడ్డ సింధు..మళ్లి ఎంత ప్రయత్నించినా..ప్రత్యర్థి ఆమెకు ఆధిక్యం సాధించే ఛాన్స్‌ ఇవ్వలేదు.

అయితే 19-19 స్కోరుతో సమం కావడంతో సింధకు మంచి ఛాన్స్‌ లభించింది. కానీ ప్రత్యర్థికి రెండు పాయింట్లు ఇచ్చింది. దీంతో గేమ్‌ ను కోల్పోవాల్సి వచ్చింది.ఆధిక్యంలోకి వెళ్లిన ఆనందంలో బిన్‌ జియానో రెండో గేమ్‌లో సత్తా చాటింది. 13-5 తో ఆధిక్యంతో దూసు కెళ్లింది. ఇక సింధు పుంచు కోవడం కష్టంగా మారింది. ప్రత్యర్థి అదే ఊపులో ఆడిరది. ఈ దశలో సింధు మూడు పాయింట్లు సాధించినా..వెంటనే ప్రత్యర్థి రెండు పాయింట్లు గెలిచి మ్యాచ్‌ ను సొంతం చేసుకుంది.