జగన్‌ సార్‌..నవ సందేహాలకు జవాబు చెప్పండి

పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి బహిరంగ లేఖ

విజయవాడ, మహానాడు :జగన్‌ సార్‌..ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిపై తాము అడుగుతున్న నవ సందేహాలకు జవాబు చెప్పాలంటూ బుధవారం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి బహిరంగ లేఖ రాశారు.

1) ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులను దారి మళ్లించిన విషయం వాస్తవం కాదా?
2) సాగు భూమి నిచ్చే కార్యక్రమాన్ని ఎందుకు నిలిపివేశారు?
3) 28 పథకాలను అర్ధాంతరంగా ఎందుకు ఆపివేశారు?
4) ఎస్సీ, ఎస్టీ పునరావాస కార్యక్రమం ఏపీలో ఎందుకు నిలిచిపోయింది?
5) ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం పెట్టిన విదేశీ విద్య పథకానికి అంబేద్కర్‌ పేరు ఎందుకు తీసేశారు?
6) దళిత, గిరిజన సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు ఈసారి ఎందుకు సీట్లు నిరాకరించారు?
7) ఎస్సీ, ఎస్టీలపై రాష్ట్రంలో దాడులు పెరిగాయి..ఇది మీ వివక్ష కాదా?
8) దళిత డ్రైవర్‌ను చంపి…సూట్‌ కేసులో డోర్‌ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని ఎందుకు సమర్శిస్తున్నారు?
9) స్టడీ సర్కిల్స్‌కు నిధులు ఇవ్వకుండా వాటిని ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారు?