– సీఎంకు 9 అంశాలతో మాజీ మంత్రి వడ్డే లేఖ!
విజయవాడ: సీఎం చంద్రబాబు నాయుడికి తొమ్మిది అంశాలతో కూడిన లేఖను మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరావు రాశారు. ఈ మేరకు ఆయన శనివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాజధాని నిర్మాణం కోసం 33 వేల ఎకరాల భూమి అవసరం లేదు, రియల్ ఎస్టేట్ వాళ్లకి వ్యాపారం చేసుకోవడానికి రాజధాని భూములు చక్కగా ఉపయోగపడుతున్నాయి… ఇప్పటికైనా అమరావతి రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు సీఆర్డీఏ చేసిన అగ్రిమెంట్ ప్రకారం మెరుగైన సదుపాయాలు కల్పించాలి.. సమయం వృథా చేయకుండా రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి… రాజధాని అభివృద్ధి కోసం 15 వేల కోట్లు అప్పుగా ఇస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రకటించడం సమంజసం కాదు.. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు గడిచిన దేశంలో అభివృద్ధి కాని రాష్ట్రాలకు ఇంకా ఉన్నాయి వాటికి తప్పనిసరిగా ప్రత్యేక హోదా కల్పించాలి.. విభజన హామీ ప్రకారం ఆంధ్రప్రదేశ్ కు తక్షణమే ప్రత్యేక హోదా కల్పించాలి.. ప్రతియేటా ఒక పర్యాయం రైతులకు రుణమాఫీ చేయాలి.. తుగ్లక్ జగన్మోహన్ రెడ్డి తన హయాంలో విద్యుత్ మోటార్లు అమర్చిన స్మార్ట్ మీటర్లు నేటి కూటమి ప్రభుత్వం తక్షణమే తీసేయాలి.