Mahanaadu-Logo-PNG-Large

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి

– ఐదేళ్లు చాలా ఇబ్బందులు పడ్డాం
– మంత్రులతో ఏపీజేఏసీ అమరావతి సంఘం నేతల భేటీ

విజయవాడ: ఎన్డీయే కూటమి ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కారమవుతాయన్న ఆశ ఉద్యోగుల కుటుంబాల్లో ఉందని ఏపీజేఏసీ అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరి జనరల్ పలిశెట్టి దామోదర్‌రావు, అసోసియేట్ చైర్మన్ ఫణి పేర్రాజు ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త పాలన కోసం ఉద్యోగులంతా ఎదురుచూశారన్నారు. ఈ మేరకు వారు మంత్రులను కలసి అభినందించారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా గత ఐదేళ్లు ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొన్న ఇబ్బందులను మంత్రులతో చర్చించారు. మంత్రి అచ్చెన్నాయుడు, పార్ధసారథి, స్వామి, ఆనం రామనారాయణరెడ్డిని కలసి వారిని ఉద్యోగుల సంఘం పక్షాన సన్మానించారు.