తండ్రిని కాపాడేందుకు కొడుకు మొసలితో పోరాటం

పశ్చిమబెంగాల్‌, మహానాడు: పశ్చిమ బెంగాల్‌లోని సౌత్‌ 24 పరగణాస్‌ జిల్లా సుందర్‌బన్‌ ప్రాంతంలోని సత్యదాస్‌పూర్‌ గ్రామానికి చెందిన 12 ఏళ్ల చిన్నారి ధైర్య సాహసలు ప్రదర్శించాడు. 2 రోజుల క్రితం అబ్బాసుద్దీన్‌ షేక్‌ అనే వ్యక్తి చేపలు పట్టేందుకు సమీపంలోని నదిలోకి వెళ్లాడు. అకస్మాత్తుగా నది నుండి పెద్ద మొసలి వచ్చి దాడి చేయడంతో.. కొడుకు మొసలితో పోరాడాడు. ఫలితం లేకపోవడంతో గ్రామానికి పరిగెత్తి గ్రామస్థులను తీసుకొచ్చాడు. తిరిగొచ్చేసరికి తన తండ్రి ఆనవాళ్లు అక్కడ కనపడలేదు. ప్రస్తుతం రెస్క్యూ టీమ్‌ వెతుకుతోంది.