-దశాబ్దాల కలలను సాకారం చేశారు
-ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
-మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్: తెలంగాణ ప్రజల 60 ఏళ్ల ఆకాంక్షలను అర్థం చేసుకుని విశ్వసనీ యతకు పట్టం కట్టి కలలను సాకారం చేసిన తెలంగాణ ప్రదాత సోనియాగాంధీ అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొనియాడారు. కాంగ్రెస్ ప్రజా పాలనలో తొలిసారిగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆశలు ఆలోచనలు, ఆకాంక్షలకు అనుగుణంగా మా పాలన కొనసాగుతుందని తెలిపారు.