Mahanaadu-Logo-PNG-Large

త్వరలో సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి ఉద్యోగుల సమస్యలు

త్రిసభ్య కమిటీ సభ్యులు చిన్నారెడ్డి, కోదండరాం వెల్లడి
టీజీవో, టీఎన్‌జీవో సంఘాల ప్రతినిధులతో భేటీ

హైదరాబాద్‌: ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ సభ్యులు జి.చిన్నారెడ్డి, ప్రొఫెసర్‌ కోదండరాం లతో రాష్ట్ర గెజిటెడ్‌ అధికారుల సంఘం, రాష్ట్ర నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగుల సం ఘం అధ్యక్షులు, నాయకులు, ప్రతినిధులు గురువారం నాంపల్లి టీజేఎస్‌ కార్యా లయంలో సమావేశమయ్యారు. పలు అంశాలపై వారు చర్చించారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను టీజీవో రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, టీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు జగదీశ్వర్‌ వివరించారు. ఈ సమస్యలను ముఖ్య మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషిచేస్తామని చిన్నారెడ్డి, కోదండరాం తెలిపారు. ఈ ప్రభుత్వం ఉద్యోగులు, అధికారులు, ఉపాధ్యాయుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని, వారి సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తారని వెల్లడిరచారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో గెజిటెడ్‌ అధికారులు, నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సంఘాలతో త్వరలోనే సమావేశం నిర్వహించేందు కు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులతో త్వరలోనే సమావేశం నిర్వహించాలని టీజీఓ, టీఎన్‌జీవో నాయకులు కోరగా సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో టీజీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, టీఎన్‌జీవో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కస్తూరి వెంకట్‌, హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ముజీబ్‌, తదితరులు పాల్గొన్నారు.