అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు

31 నాటికి కేరళలో ప్రవేశించే అవకాశం
22న బంగాళాఖాతంలో అల్పపీడనం
కోస్తా, రాయలసీమలో వర్షాలు
తెలంగాణ వ్యాప్తంగా ఎల్లో అలర్ట్‌ జారీ

అమరావతి :  నైరుతి రుతుపవనాలు అండమాన్‌ను తాకాయి. ఈ నెల 31 నాటికి కేరళలో ప్రవేశించే అవకాశం ఉందని, జూన్‌ మొదటి వారంలో రాయల సీమలోకి రావచ్చని వాతావరణ శాఖ వెల్లడిరచింది. రుతుపవనాల ప్రభావంతో ఈ నెల 22న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి 24వ తేదీ నాటికి వాయు గుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఛత్తీస్‌గడ్‌ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా ద్రోణి ప్రభావం ఉంటుందని, కోస్తా, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది. తెలంగాణ వ్యాప్తంగా ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. మరో నాలుగురోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తా యని తెలిపింది.