-ఒక్కరోజే 54 మంది అరెస్ట్
-ఐదుగురిపై రౌడీషీట్లు
నరసరావుపేట, మహానాడు: జిల్లాలో ఎన్నికల కేసులకు సంబంధించి పురోగతిపై ఎస్పీ మల్లికాగార్గ్ సమీక్షించారు. జిల్లాలో సిట్ కేసులలో ఈ ఒక్కరోజే 13 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. పోలింగ్ తేదీన, పోలింగ్ తేదీకి ముందు, పోలింగ్ తర్వాత జరిగిన కేసులకు సంబంధించి ఈ ఒక్కరోజే 54 మందిని అరెస్టు చేసినట్లు వివరించారు. ఎన్నికల నేరాలలో ఈ ఒక్కరోజే 9 మందికి 41ఏ సీఆర్పీసీ నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు. నరసరావుపేట సబ్ డివిజన్లో 1, సత్తెనపల్లి సబ్ డివిజన్లో 46, గురజాల సబ్ డివిజన్లో 27 మందిని బైండోవర్ చేసినట్లు తెలిపారు. నరసరావుపేట సబ్ డివిజన్లో ఐదుగురిపై రౌడీషీట్లు ఓపెన్ చేసిన ట్లు చెప్పారు. బైండోవర్ను ఉల్లంఘించిన ఐదుగురికి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు నోటీసులు ఇచ్చినట్లు పేర్కొన్నారు.