అమరావతి: మార్షల్ (కానిస్టేబుల్) కూచిపూడి లదియా రావు అసెంబ్లీ ఆవరణలో డ్యూటీ చేస్తుండగా తీవ్రమైన గుండెనొప్పి అపస్మారక స్థితి చేరుకోగా తోటి సిబ్బంది ఎన్నారై ఆసుపత్రికి తీసుకెళ్ల గా డాక్టర్లు మరణించారని తెలిపారు.. ఈ విషయం తెలుసుకున్న స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మార్షల్ లదియారావు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి పరామర్శించి, ప్రభుత్వం నుంచి ఆ కుటుంబానికి రావాల్సిన ప్రయోజనాలను త్వరితగతిన అందేలా చర్యలు చేపడతామని మరియు కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తామని హామీ ఇవ్వటం జరిగింది.