మానసిక ఆరోగ్యానికి క్రీడలు ఎంతో ముఖ్యం

– ఎమ్మెల్యే అరవింద బాబు

నరసరావుపేట, మహానాడు: క్రీడల ద్వారానే మనలో మానసిక ఆరోగ్యం,శారీరక సామర్థ్యం మెరుగుపడుతుందని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవింద బాబు అన్నారు. నరసరావుపేట మండలం కేసానుపల్లి గ్రామంలో ఎంఎఎం కాలేజి ఆవరణలో ఏర్పాటు చేసిన ఏపీ స్టేట్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. రాష్ట్రంలోని పిల్లలకు క్రీడా స్ఫూర్తి పెంచే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. క్రీడలతో మాత్రమే మానసిక ఎదుగుదల సాకారం అవుతుందని, ఇలాంటి కార్యక్రమాల నిర్వహణకు ప్రతి సంస్థా ముందుకు రావాలని ఎమ్మెల్యే అరవింద బాబు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఏఎం అధినేత కాలేజీ ఎం.శేషగిరి, డాక్టర్‌ నెల్లూరి రమేష్, కపిలవాయి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.