అబద్ధాలు ప్రచారం చేస్తే సహించం

బీజేపీ, బీఆర్‌ఎస్‌ అక్కసుతోనే బురద జల్లుతున్నాయి
పౌరసరఫరా శాఖలో గత ప్రభుత్వం అప్పులు తెలియదా?
అబద్ధాలు మాట్లాడితే నాయకులు కాలేరు..వాస్తవాలు చెప్పండి
మిల్లర్ల తప్పుకు ప్రభుత్వాన్ని బద్నాం చేస్తారా?
తడిసిన ధాన్యాన్ని కొన్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్‌ పార్టీ
మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
ఏలేటి, కేటీఆర్‌ ఆరోపణలకు కౌంటర్‌

హైదరాబాద్‌, మహానాడు : బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ ఆరోపణలపై ఆదివారం మీడియా సమావేశంలో మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌, బీజేపీ కలిసినా సీట్లు రావట్లేదనే అక్కసుతో వారు కూడబలుక్కుని అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాల విమర్శలకు మా పనితీరే సమాధానమని చెప్పారు. మార్పుకు అడ్డు వస్తే సహించేది లేదని, అబద్ధాలను ప్రచారం చేస్తే బీఆర్‌ఎస్‌ పార్టీ కనుమరుగు అవుతుందని హెచ్చరించారు. మీలో కూడా మార్పు తెచ్చే ప్రయత్నం చేస్తాం.. గత ప్రభుత్వ పొరపాట్లను మేం చేయమని తెలిపారు. గత ప్రభుత్వాన్ని సలహాలు, సూచనలు ఇవ్వమని అనేకసార్లు కోరాం. మా ప్రభుత్వం అత్యంత ప్రజాస్వామికం గా ఉంది. ప్రజలకు ఇస్తున్న పథకాలను కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌ పక్కదోవ పట్టిస్తు న్నారు. గత సంవత్సరం ఏంజీఏం హాస్పిటల్‌లో 121 సార్లు కరెంట్‌ బ్రేక్‌ డౌన్‌ అయింది. ఎలుకలు రోగుల చర్మాన్ని తిన్నాయి. గత ప్రభుత్వం సివిల్‌ సప్లయ్‌ శాఖలో అడ్డగోలుగా అప్పులు చేసిందని గుర్తుచేశారు.

మహేశ్వరరెడ్డికి ఇంత బుద్ధి వచ్చిందా?

ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి మాట్లాడుతూ ఆ పార్టీలోకి వెళ్లగానే వాళ్ల తప్పులు..ఒప్పులుగా మారాయా? లీడర్‌ కావాలని కోరికతో నిజాలను దాస్తావా మహేశ్వర రెడ్డి? ఏదైనా మాట్లాడుతా..పేపర్లో పేరు వస్తే చాలు అని అనుకుంటున్నావా? ఎక్కువ మాట్లా డితే పెద్ద లీడర్‌ అవ్వరు. వాస్తవాలు మాట్లాడితే అవుతారు. తడిచిన ధాన్యాన్ని కొన్న ప్రభుత్వం తమదేనని స్పష్టం చేశారు. పౌరసరఫరా శాఖ ఇంత అప్పుల్లోకి పోవడానికి కేంద్రం కారణం కాదా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో ధాన్యం సగటు ధర రూ.1700 మాత్రమే, ఇప్పుడు రూ.2022లు ఉంది. మిల్లర్లు చేస్తున్న తప్పుకు ప్రభుత్వాన్ని బద్నాం చేస్తారా? మిల్లర్ల విషయంలో ఇప్పటికే చాలా మార్పు లు తెచ్చాం. ఐదేళ్లలో కేసీఆర్‌ రుణమాఫీ చేయలేదు. మేం ఐదు నెలల్లో చేయబోతు న్నాం. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్‌ ఇస్తున్నారా? అని ప్రశ్నించారు.