కృష్ణలంకలో స్టేడియం

– ఎంపీ శివనాథ్, ఎమ్మెల్యే గద్దె

విజయవాడ, మహానాడు: కృష్ణలంకలోని పొట్టి శ్రీరాములు మున్సిపల్ హైస్కూల్ పక్కన ఉన్న గ్రౌండ్లో స్టేడియం నిర్మాణానికి కృషి చేస్తున్నట్టు ఎం.పి కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ వెల్లడించారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 21వ డివిజన్లోని కృష్ణలంక పొట్టిశ్రీరాములు హైస్కూల్లోని గ్రౌండ్, వాకింగ్ ట్రాక్, ఇండోర్ స్టేడియంలను మంగళవారం ఉదయం పరిశీలించారు. ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ గ్రౌండ్ను పరిశీలించి శుభ్రం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించామని చెప్పారు. అంచనాలు రూపొందించి ఇవ్వాలని ఆదేశించారు. ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ ఇక్కడ ఎలిమెంటరీ, హైస్కూల్, జూనియర్ కళాశాల ఉన్నాయని, ఈ విధంగా అన్ని స్థాయి విద్యాసంస్థలు ఒకే చోట పక్కనే ఇండోర్ స్టేడియం కూడా ఉందని, ఈ విధంగా జిల్లాలో ఎక్కడా లేవని చెప్పారు. పక్కనే దాతలు ఇచ్చిన ఏడు ఎకరాల గ్రౌండ్ ఉందని, దానిని క్రికెట్ స్టేడియంగా అభివృద్ధి చేసుకుంటే బాగుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గొరిపర్తి నామేశ్వరరావు, వేములపల్లి రంగారావు, పోతిరెడ్డి రమణ, పెరుమాళ్ళ గురునాథం, నిమ్మల జ్యోతిక, కేశనం భావన్నారాయణ, కొడాలి సాయిబాబు, నిమ్మల దుర్గారావు, పుప్పాల సుబ్బారావు, తదితరులు ఉన్నారు.