-మీ రక్తం మరగడం లేదా ? మీలో పౌరుషం లేదా ?
-దళితులను తోట ఇనుప రాడ్ లతో కొట్టి చిత్ర హింసలు పెట్టారు
-గుండ్లు కొట్టించి, కనురెప్పలు, మీసాలు తీయించి అవమానించారు
-కోర్టు కూడా తోట నేరస్థుడని నిర్ధారించింది
-దళితులై వుండి ఇంకా అతనిని సమర్థిస్తున్నారా
-ఓటు అనే ఆయుధంతో తో తోట రాజకీయ చరిత్రకు శిరోముండనం చేయాలి
-తోటను చిత్తుగా ఓడించి జగన్ కు బుద్ధి చెప్పాలి
-తోటకు ప్రజా కోర్ట్ లో ఓటమి గురించే రాష్ట్ర దళితుల ఎదురుచూస్తున్నారు
-మండపేట రౌండ్ టేబుల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ముప్పాళ్ళ సుబ్బారావు
అహంకారంతో దళితులను చిత్రవధ చేసి ఘోరంగా అవమానించిన తోట త్రిమూర్తులకు దళితులు ఓటుతోనే అతని రాజకీయ జీవితానికి శిరోముండనం చేయాలని ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు, సమాచార హక్కు చట్ట రక్షణ వేదిక వ్యవస్థాపకులు ముప్పాళ్ళ సుబ్బారావు ఆన్నారు. దళితులపై జరుగుతున్న దమనకాండ లను నిరసిస్తూ మండపేట శుభమస్తు కళ్యాణ మండపం లో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి దూలి జయరాజు మాదిగ సభాధ్యక్షతన నిర్వహించిన మేధావుల రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన పలువురు నేతలు మాట్లాడుతూ డాక్టర్ సుధాకర్ కు జరిగిన అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఆనంతబాబు దళితులను చంపి డోర్ డెలివరీ చేసారని దుయ్యబట్టారు. గాయాలతో డ్రైవర్ శరీరం పై 23 చోట్ల గాయాలు వున్నా సరే అనంతబాబు నే సమర్ధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అతనికి మధ్యస్థ బెయిల్ ఇప్పించేందుకుఎంతో కృషి చేసిందన్నారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు దళితులకు శిరో ముండనం చేసి జాతి నీ అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు.
దళితులకు మేనమామ గా ఉంటానని చెప్పిన జగన్ దళితులను చంపి, అవమానించిన వారికే సీట్లు కట్టబెట్టి ఆయన సైతం దళిత ద్రోహి గా మిగిలాడన్నారు. ముఖ్యంగా మండపేట నియోజకవర్గ ప్రజలు ఇచ్చే తీర్పు కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. ఈ తీర్పు దళిత జాతిపై ఎంతో ప్రభావం చూపుతుందన్నారు. మండపేట లో తోట గెలిస్తే దళితులపై దాడులు పెరిగిపోతాయన్నారు. ఎన్ని చేసినా ఏమీ కాదులే అని తప్పుడు సంకేతాలు రాష్ట్రమంతటా వెళతయన్నారు. ఇది రాష్ట్ర ప్రజలకు మంచిది కాదన్నారు.
నెరస్తుడని కోర్టు లో నిర్ధారణ అయిన తోట త్రిమూర్తులను ఘోరంగా ఓడించి మరోసారి మరొకరికి ఇలాంటి తప్పుడు ఆలోచన రాకుండా చేయాలన్నారు. కోర్టు శిక్ష విధించిన తరువాత కూడా తోట వెనుక నిలిస్తే వారంతా అంబేద్కర్ ను వ్యతిరేకించిన వారుగా, జాతి ద్రోహులుగా మిగిలిపోతారన్నారు. ఆనాడు దళితులను ఇనపరాడ్ లతో చిత్ర హింసలు పెట్టీ గుండు తో పాటు మీసాలు,కనుబొమ్మలు సైతం తొలగించి అవమానిస్తే రోజులు తరబడి బాధితులు కుమిలి కుమిలి ఏడ్చారన్నారు.
ఓ జర్నలిస్టు సోదరుడు ధైర్యం చేసి ఘటన జరిగిన కొద్ది రోజులకు వార్త రాస్తే అప్పటి జిల్లా ఎస్పీ త్రిపాఠి దీనిపై స్పందించి నేరుగా ఆయనే బాధితుల వద్దకు వచ్చి ధైర్యం భరోసా ఇస్తే అప్పుడు వారు పిర్యాదు చేశారన్నారు. ఇంతటి నేర స్వభావం వున్న వ్యక్తికి అసెంబ్లీలో అడుగుపెట్టే హక్కు లేదన్నారు. ఈ ఘటనలు మీలో రక్తాన్ని మరిగించడం లేదా మీకు పౌరుషాన్ని కలిగించడం లేదా అంటూ ఆవేదన స్వరంతో మాట్లాడారు. అనంతబాబు కు జరిగినట్టు గా తోట కు అవమానాలు జరగాలన్నారు. దళిత కాలనీల్లో అడుగుపెడితే తోట ను తరిమి తరిమి కొట్టాలన్నారు.
అట్రాసిటీ చట్టం రక్షణ గా ఉన్నాసరే దళితులపై ఇంత విచక్షణా రహితంగా ప్రవర్తించిన తోట పట్ల బీసీ లు సైతం అప్రమత్తంగా ఉండాలన్నారు. దళితులకు ఎదురైన పరిస్థితులే రేపు బీసీ లకు ఎదురు కావచ్చన్నారు. తోట ఏ రాజకీయ పార్టీ లో వున్నా సరే ప్రజలు అతన్ని వ్యతిరేకించాలన్నారు. ఓటు ద్వారా తగిన శాస్తి చేసి నేరస్థులకు ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు.
మరో నేత మాట్లాడుతూ 1990 లో ఎమ్మెల్సీ తోట గేదెలు అమ్మిపెట్టినందుకు తొక డబ్బులు కింద గేదెకి 5 రూపాయలు తీసుకునేవారన్నారు. అలాంటి వ్యక్తికి నేడు ఇన్ని వందల కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. అవినీతి అక్రమాలు, సెటిల్ మెంట్లు, దందా లు తోనే ఇంత డబ్బు సంపాదించరాన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఐకమత్యంగా ఎమ్మెల్సీ తోట ను ఓడించాలన్నారు. ఈ సమావేశంలో అత్యధిక సంఖ్యలో దళిత నాయకులు, మేధావులు తదితరులు పాల్గొన్నారు