– ఎమ్మెల్యే గళ్ళ మాధవి
గుంటూరు, మహానాడు: కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటికీ వంద రోజులు అయిన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గళ్ళ మాధవి ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం పేరుతో ప్రజల్లోకి వెళ్ళారు. శుక్రవారం 24వ డివిజన్ అంకమ్మ నగర్ నుండి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇంటింటికి తిరిగి ఈ 100 రోజులలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కరపత్రం రూపంలో ప్రజలకు అందజేసి ప్రజలకు వివరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళ మాధవి మాట్లాడుతూ… “ఇది మంచి ప్రభుత్వం” పేరుతో ప్రజలలోకి వెళ్తున్నామని, వారి నుండి అపూర్వ స్పందన లభిస్తుందని, ప్రభుత్వం వచ్చిన వందరోజుల్లోనే ప్రజల్లోకి నేరుగా వెళ్లి ప్రభుత్వ పనితీరు గురించి అడుగుతున్నామంటే అది మా నిజాయితీ, నిబద్ధతకు నిదర్శనం అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పని చేస్తుందని మెగా డీఎస్సీ, పెన్షన్ పెంపు, ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు, ఉచిత ఇసుక వంటి ప్రజలకు మేలు చేసే నిర్ణయాలను తీసుకుని ప్రజలకు అండగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిలబడింది. ప్రభుత్వ పనితీరుకి తార్కాణమే విజయవాడ వరదల సమయంలో అధికార యంత్రాంగం తో ముఖ్యమంత్రి చంద్రబాబు నడిపిన తీరే నిదర్శనమని ఆమె కొనియాడారు.
పంచాయతీరాజ్ వ్యవస్థకు జీవం పోశారని, రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడానికి చంద్రబాబు శక్తివంతం లేకుండా కృషి చేస్తున్నారని, సంక్షేమం అభివృద్ధిని సమపాళ్ళలో ప్రజలకు అందించడంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం విజయవంతం అయ్యిందన్నారు. పేదవారికి సొంత ఇంటి కల సహకారం చేసే విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పని చేస్తోందని, వచ్చే ఏడాది మార్చిలోపు లబ్ధిదారులకు గృహాలను పూర్తి చేసి ఇవ్వబోతున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో సింహాద్రి కనకాచారి, కోవెలమూడి రవీంద్ర, రాజీవ్ ఆనంద్, మానుకొండ శివ ప్రసాద్, మద్దిరాల మ్యాని, కనపర్తి శ్రీనివాస్, కసుకుర్తి హనుమంతరావు, సుఖవాసి శ్రీనివాస్, ఆళ్ల హరి, దాసరి రమణ, దామచర్ల శ్రీనివాస్, మానం పద్మశ్రీ , వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్ (బుజ్జి), శ్రీవల్లి, కొమ్మినేని కోటేశ్వరరావు, ఈరంటి వర ప్రసాద్, ముత్తినేని రాజేష్,షేక్ బుడే, కొల్లి అనిల్, కామినేని చంద్ర, కరంగి అనిల్, తదితరులు పాల్గొన్నారు.