Mahanaadu-Logo-PNG-Large

ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చర్యలు చేపట్టాలి

అక్రమాల నివారణకు అందుబాటులో వెబ్‌సైట్‌
సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ

అమరావతి, మహానాడు:  ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు పారదర్శకంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిపించేలా చర్యలు తీసుకోవాలని సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ కార్యదర్శి, పూర్వ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ కోరారు. గురువారం ఉదయం విజయవాడ వెన్యూ ఫంక్షన్‌ హాలులో ఓటు వేసి రక్షించుకో – ప్రజాస్వామ్యాన్ని గెలిపించుకో అన్న అంశంపై జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సమన్వయకర్తగా సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి వ్యవహరించారు. నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ప్రసంగిస్తూ రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం నిష్పక్షపాతంగా వ్యవరించాలని, పోలింగ్‌ సిబ్బంది తగు జాగ్రత్తలతో ఎన్నికలు సక్రమంగా జరిగేటట్లు కృషి చేయాలని కోరారు. తిరుపతి, చిత్తూరులో           కొందరు పోలీసు అధికారులు అత్యుత్సాహంతో ప్రజలకు ఇబ్బంది కలిగించటాన్ని ఖండిరచారు. సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ ఎన్నికల అక్రమాలను నివారించడానికి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీఎలక్షన్‌.కామ్‌ వెబ్‌సైట్‌ రూపొందించిందని దీనిని ఉపయోగించుకోవాలని కోరారు.

దుర్మర్గులను ఓడిరచాలి…

ప్రముఖ సినీ గేయరచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మాట్లాడుతూ ఓటును వజ్రాయుధంగా వాడాలని, పరమ దుర్మార్గులను ఓడిరచాలని పిలుపునిచ్చారు. లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ నేడున్న పరిస్థితుల్లో ప్రత్యామ్నాయాలను రూపొందించుకోలేమని ఉన్న వాటిలో మంచి ప్రత్యామ్నాయాన్ని ఎన్నుకోవాలని కోరారు. ప్రముఖ రాజనీతి శాస్త్ర ఆచార్యులు ప్రొఫెసర్‌ కొండవీటి చిన్నయ్య సూరి ప్రసంగిస్తూ ఉత్సాహ వంతులైన పురజనుల భాగస్వామ్యంతోనే ప్రజాస్వామ్యం వికసిస్తుందని అన్నారు. భారతదేశంలో 1927లో జరిగిన మొదటి ఎన్నికల్లో 4 శాతం మంది మాత్రమే ఓటింగ్‌లో పాల్గొన్నారు. 1935లో 10 శాతం మంది, 1946లో 14 శాతం మంది, 1952లో 45 శాతం మంది, ఏపీలో 2019లో 80 శాతం మంది పాల్గొనడం హర్షణీయమన్నారు. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో పట్టణ ఓటింగ్‌  65 శాతం లోపుగా ఉంద ని దీన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ఓటింగ్‌ శాతం పెరగాలి…

ప్రముఖ వైద్యులు జి.సమరం ప్రసంగిస్తూ ఎన్నికలు డబ్బుల పండుగగా మార్చవద్దని, అభివృద్ధి వైపు ఓటర్లు మొగ్గు చూపాలని, కొత్తగా నమోదైన ఓటర్లు తమ ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజాస్వామ్య పటిష్టతకు నగర ఓటర్ల ఓటింగ్‌ శాతం పెరగాలన్నారు. మేజర్‌ జనరల్‌ బి.వి.రావు పరమ విశిష్ట సేవ మెడల్‌ అవార్డు గ్రహీత ప్రసంగిస్తూ ప్రజలకు అన్ని రంగాల్లో భద్రతను కల్పించే రాజకీయ వ్యవస్థను రూపొందించుకోవాలన్నారు. అనంతరం రంగం ప్రజా సాంస్కృతిక వేదిక రాష్ట్ర కార్యదర్శి ఆర్‌.రాజేష్‌ రూపొందించిన ‘‘ఓటరు ఓటేద్దాం’’ అనే వీడియో సీడీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ నగర పూర్వ మేయర్‌ డాక్టర్‌ జంధ్యాల శంకర్‌, పెన్షనర్స్‌ పార్టీ సుబ్బరాయన్‌, లయన్స్‌ క్లబ్‌ పూర్వ గవర్నర్‌ తాతినేని శ్రీహరిరావు, రోటరీ డిస్ట్రిక్ట్‌ గవర్నర్‌ రావూరి వెంకట సుబ్బారావు, రోటరీ క్లబ్‌ పూర్వ గవర్నర్‌, లోక్‌సత్తా పూర్వ అధ్యక్షుడు కామినేని పట్టాభిరామయ్య, ప్రముఖ రచయిత జి.వి.పూర్ణచం ద్‌, హైకోర్టు న్యాయవాది పి.రవితేజ, కోవే సంస్థ వ్యవస్థాపకులు రాధిక పాల్గొన్నారు.