మళ్లీ జగన్‌ను గెలిపిస్తే రాష్ట్రం సర్వ నాశనం
సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా, లావు రుద్రమదేవి
సత్తెనపలి, మహానాడు : రాజధాని అమరావతితో సత్తెనపల్లి ప్రాంత అభివృద్ధిని ప్రజలు కోరుకోవాలని సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ, లావు శ్రీకృష్ణదేవరాయలు సోదరి లావు రుద్రమదేవి అన్నారు. సత్తెనపల్లి రూరల్ మండలం నందిగం, కంటేపూడి గ్రామాలలో గురువారం వారు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గ్రామస్తులు పెద్దఎత్తున వారికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీకి ఓటు వేయడం అంటే స్వేచ్ఛగా జీవించే హక్కును కోల్పోతున్నట్లే అని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. ప్రజా రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేస్తానని నమ్మించి జగన్ మోసం చేశాడని విమర్శించారు.
అమరావతి అభివృద్ధి చెందకపోవడంతో సత్తెనపల్లి నియోజకవర్గంలో భూములు, స్థలాల ధరలు గత ఐదేళ్లలో ఊహించని విధంగా పడిపోయి పేద మధ్యతరగతి జీవన ప్రమాణాలు దెబ్బతిన్నాయన్నారు. రాజధాని నిర్మాణం జరిగితే సత్తెనపల్లి ఎంతో అభివృద్ధి చెందుతుంది అన్నారు. ఈ ప్రచారంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.