నరసరావుపేటలో స్ట్రాంగ్‌రూమ్‌ తనిఖీ

భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌, ఎస్పీ
కౌంటింగ్‌కు పటిష్ఠ బందోబస్తుపై సూచనలు

నరసరావుపేట, మహానాడు : సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌కు సంబంధించి నరసరావుపేట రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని జేఎన్‌టీయూ కళాశాల ప్రాంగణంలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూమ్‌ దగ్గర గురువారం పల్నాడు జిల్లా కలెక్టర్‌ శ్రీకేష్‌ లాత్కర్‌, ఎస్పీ మల్లికా గార్గ్‌ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ కౌంటింగ్‌కు సంబంధించి జిల్లాలో ఎలాంటి ఊరేగింపులు, విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని, ఎవరైనా శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కౌంటింగ్‌ జరిగే కళాశాల ప్రాంగణం, చుట్టుపక్కల ప్రాంతాలలో పటిష్ఠమైౖన బందోబస్తు ఏర్పాటు చేశామ ని తెలిపారు.

ఎన్నికల కౌంటింగ్‌ జరుగు ప్రదేశానికి నిర్ణీత దూరంలో వాహనా లు పార్క్‌ చేసి రావాలని సూచించారు. సమస్యాత్మక గ్రామాలు, ముఖ్యమైన ప్రదేశాలు, ప్రధాన కూడళ్లలో పోలీసు బలగాలతో పికెట్‌లను ఏర్పాటు చేస్తున్నా మని చెప్పారు. ఎన్నికల కోడ్‌, 144 సెక్షన్‌, 30 పోలీస్‌ యాక్ట్‌ అమలులో ఉన్నందున నలుగురి కన్నా ఎక్కువమంది ఒకే చోట గుమికూడి ఉండరాదని, బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వ హించరాదన్నారు. పెట్రోల్‌ బంకులలో పెట్రోల్‌, డీజిల్‌ను విడిగా బాటిల్స్‌లో పోయరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌, అడిషనల్‌ ఎస్పీ అడ్మిన్‌ రాఘవేంద్రరావు, నరసరావుపేట డీఎస్పీ సుధాకర్‌రావు, ఎస్‌బీ సీఐ సురేష్‌బా బు, నరసరావుపేట రూరల్‌ సీఐ, ఎస్‌ఐలు పాల్గొన్నారు..