Mahanaadu-Logo-PNG-Large

సుజనాచౌదరి పోటీ పశ్చిమ ప్రజల అదృష్టం

ఆయన గెలుపుతో నియోజకవర్గ అభివృద్ధి
బీజేపీ అధికార ప్రతినిధి ఆర్‌.డి.విల్సన్‌

విజయవాడ, మహానాడు : పశ్చిమ నియోజకవర్గం నుంచి సుజనాచౌదరి పోటీ ఇక్కడి ప్రజల అదృష్ణమని బీజేపీ అధికార ప్రతినిధి ఆర్‌.డి.విల్సన్‌ అన్నారు. ఆదివారం రాత్రి రైల్వే కాలనీలో జరిగిన రైల్వే ఉద్యోగుల ఆత్మీయ సదస్సులో పాల్గొని ఆయన ప్రసంగించారు. పార్లమెంటు సభ్యుడు కావలసిన సుజనా చౌదరి పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి కావడం నియోజకవర్గ ప్రజల అదృష్టమని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్‌లో 11 విద్యా సంస్థలు ఒకే ఏడాదిలో రావడానికి కారణం సుజనా చొరవేనని వివరించారు. తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వంలో 72 శాతం పోలవరం పూర్తి కావడా నికి కృషి చేశారని వివరిం చారు. అమరావతి రైతులకు అండగా నిలవడం దగ్గర నుంచి, రాజధాని నిధులు సమీకరిం చడం వరకు ప్రతిఘట్టంలోనూ ఆయన పాత్ర ఉందని ప్రశంసిం చారు. రాష్ట్రం మొత్తానికి ఎన్నో సేవలు చేసిన ఆయన ఇక్కడ ఎమ్మెల్యే అయితే ప్రజల అదృష్ట మవుతుందన్నారు.

కులం, మతం, ప్రాంతం సంబంధం లేకుండా ఎంతోమందికి ఎన్నో రకాలు గా సేవలు అందించిన ఘనత సుజనాచౌదరికి దక్కుతుందన్నారు. కరోనా సమయంలో విజ యవాడలో పెద్ద హెల్త్‌ సెంటర్‌ పెట్టి ఒక్క రూపాయి పేదలు పెట్టుకోకుండా కార్పొరేట్‌ వైద్య సేవలు అందించి ఆదుకున్న మనుషుల్లో దేవుడు అని కొనియాడారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌, రైల్వే అధికారి పాపారావు, భాస్కర్‌రావు, వెళ్లి సంక్షేమ సంఘం జాతీయ నాయకుడు అప్పారావు, నాయి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర నాయకుడు రామారావు, వడ్డెర సంఘం నాయకుడు సీతారాం తదితరులు పాల్గొన్నారు.