మాల,మాదిగ, రెల్లి నేతలతో సుజనాచౌదరి సమావేశం

విజయవాడ, మహానాడు : విజయవాడలో పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి నివాసంలో ఆదివారం ఉదయం ఆత్మీయ సమావేశం సమావేశం జరిగింది. మాల మహానాడు నాయకులు మల్లెల వెంకట్రావు, బండి బాలయోగి, మాదిగ దండోరా నేత పేరుపోగు వెంకటేశ్వరావు, రెల్లి సంఘం జాతీయ అధ్యక్షుడు భూపతి అప్పారావు, నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు కె.వి.అప్పారావు, వడ్డెర సంఘం నేత వేముల సీతారామ్‌, ప్రోగ్రాం స్ట్రాటజిస్ట్‌ రామచంద్ర బోసు, సుజనా ఆర్మీ నుంచి సాంబశివ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల ఆర్‌.డి.విల్సన్‌ సమన్వయంతో మాల, మాదిగ, రెల్లి బహుజన వేదిక సదస్సు విజయవంతం చేసినందు కు కృతజ్ఞతలు తెలిపారు.