కార్పొరేట్లకు దాసోహం అంటున్న పార్టీలు
నేతలే కాదు.. ప్రభుత్వ విధానాలు మారాలి
సమాజ మార్పుకు కమ్యూనిస్టులు పోరు ఆగదు
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబూరావు
విజయవాడ, మహానాడు : కమ్యూనిస్టు నేత పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతిని సీపీఎం, సీఐటీ యూ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో విజయవాడలో ఘనంగా నిర్వహించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబూరావు పాల్గొని నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య జీవితం ఆదర్శ ప్రాయమన్నారు. నేటి రాజకీయాలు అవినీతిమయమై బీజేపీ, వైసీపీ, టీడీపీలు కార్పొరేట్లకు కొమ్ము కాస్తున్నాయన్నారు. నేతలే కాదు, ప్రభుత్వ విధానలు మారాలని ఆకాం క్షించారు. సమాజ మార్పుకు కమ్యూనిస్టులు పోరు ఆగదన్నారు. ఈ కార్యక్ర మాల్లో సీపీఎం జిల్లా కార్యదర్శి డి.వి.కృష్ణ, రాష్ట్ర కమిటీ సభ్యులు డి.కాశీనాథ్, కే.శ్రీదేవి, సీపీఎం నేతలు బి.రమణరావు, కె.దుర్గారావు, సిహెచ్.శ్రీనివాస్, పీర్ సాహెబ్, వై.సుబ్బారావు, నాగేశ్వరరావు, లక్ష్మణ, టి.శ్రీను, వెంకటేశ్వరరెడ్డి, నిజాముద్దీన్ కార్మిక నేతలు సుధాకర్, మురళి, భూలోకం పాల్గొన్నారు.