Mahanaadu-Logo-PNG-Large

గుంటూరు ఆసుపత్రిలో సూపరింటెండెంట్‌ ఆకస్మిక తనిఖీలు

ప్రైవేటు సిబ్బంది దగ్గర గదుల తాళాలపై అసంతృప్తి
పెట్‌ స్కాన్‌ ఎక్కువ ధరపై సిబ్బందికి ఆదేశాలు
వార్డులలో వైద్యసేవలపై రోగులతో మాట్లాడి ఆరా

గుంటూరు: ప్రభుత్వ ఆసుపత్రిలోని వివిధ వార్డులను ఆదివారం సూపరింటెండెం ట్‌ డాక్టర్‌ కిరణ్‌కుమార్‌ ఆకస్మిక తనిఖీలు చేశారు. తొలుత సర్జికల్‌ ఐసీయూను సందర్శించారు. రోగులను పలుకరిస్తూ ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నా రు. సర్జరీ పోస్టు ఆపరేటివ్‌ వార్డును తనిఖీ చేశారు. సూపరింటెండెంట్‌ స్వయంగా చేసిన క్లిష్టమైన ఆపరేషన్‌ రోగులను పర్యవేక్షించారు. వైద్యం జరుగుతున్న విధా నాన్ని అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి 333 వార్డును పరిశీలించారు. రోగులకు వైద్యం సరిగా అందుతున్నదో లేదో అక్కడి నర్సింగ్‌ సిబ్బందిని అడిగి ఆరా తీశారు. అనంతరం నాట్కో కేన్సర్‌ విభాగం, సర్జరీ విభాగంలో ఉన్న రోగు లను సందర్శించి వారితో మాట్లాడి వైద్యంలో ఏవైనా లోటుపాట్లుంటే తన దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు.

కొన్ని రూములకు వేసిన తాళాలు నర్సుల వద్ద లేకపోవడం.. ప్రైవేటు సిబ్బంది దగ్గర ఉండటాన్ని గమనించి అసహనం వ్యక్తం చేశారు. దగ్గు ఆయాసంతో ఉన్న రోగికి సత్వరమే కళ్లె పరీక్ష, టీబీ పరీక్ష చేయమని పీజీ విద్యార్థులను ఆదేశించారు. రోగికి పెట్‌ స్కాన్‌ 15 వేలకు చేయించటాన్ని ఆయన తప్పుపట్టారు. సదరు పెట్‌ స్కాన్‌ మరింత తక్కువకు 12 వేలకు చేయ టానికి పంపించే వారమని తెలిపారు. ఇలాంటి విషయాల్లో తన దృష్టికి తెలిసి ఉంటే 12 వేలకు చేయమని పరిపాలన విభాగం నుంచి పంపించే వారమని తెలిపారు. ఇకనుంచి తనకు తెలియచేయాలని ఆయన ఆదేశించారు. సూపరింటెం డెంట్‌ వెంట వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది పాల్గొన్నారు.