Mahanaadu-Logo-PNG-Large

రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీఏ కూటమికి మద్దతు

 – టీడీపీ పాలనలో బీసీలకు సామాజిక న్యాయం
 – బీసీ సంక్షేమ సంఘం నాయకుల ప్రకటన
 -గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసానితో సమావేశం

గుంటూరు, మహానాడు : గడిచిన ఐదేళ్లుగా బీసీలపై హత్యలు, అత్యాచారాలు, వేధింపులు చేయడమే ఈ ప్రభుత్వం ధ్యేయంగా మారింది. బీసీలు రాజ్యాధికారం చేపట్టాలంటే ఎన్డీఏ కూటమితోనే సాధ్యం. బీసీ సబ్‌ ప్లాన్‌ నిధులను నవరత్నాలకు మళ్లించి ఈ సీఎం చోద్యం చూస్తున్నారు. బీసీలకు ప్రత్యేక రక్షణ హక్కు చట్టం టీడీపీతోనే సాధ్యమని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు కేశన శంకర్రావు, గుంటూరు పార్లమెంట్‌ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖరరావు పేర్కొన్నారు. గుంటూరు అమరావతి రోడ్డు స్వగృహ కన్వెన్షన్‌లో బీసీ రాష్ట్ర సంక్షేమ సంఘం ఎన్డీఏ కూట మికి మద్దతు తెలుపుతూ శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భం గా బీసీ సంఘం నాయకులతో పాటు పెమ్మసాని చంద్రశేఖర్‌ మాట్లాడారు.

కేశన శంకర్రావు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి సంక్షేమ సంఘం నాయకులు నుంచి అభిప్రా య సేకరణ తీసుకున్న తర్వాతే ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించినట్లు తెలిపారు. బీసీలకు ప్రత్యేక రక్షణ హక్కు చట్టం కల్పిస్తామని ప్రకటించిన తర్వాత టీడీపీపై నమ్మకం పెరిగింది. ఈ ప్రభుత్వంలో బీసీ సామాజి వర్గానికి చెందిన పలువురు ఐఏఎస్‌, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల కు నిజాయితీగా పని చేశారన్న ఒకే ఒక కారణంతో ఈ ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇవ్వకుండా వేధిస్తోందని, రాష్ట్రం పారిశ్రామికంగా ఎదగాలన్నా, యువతకు ఉద్యోగాలు కల్పించాలన్నా ఎన్డీఏ కూటమి విజయం సాధించాల్సిన అవసరం ఉందన్నారు.

16 యూనివర్సిటీలలో ఒక్క పోస్టేనా…

పెమ్మసాని చంద్రశేఖర్‌ మాట్లాడుతూ 2019లో జగన్‌ చెప్పిన మాటలు విని బీసీలలో అన్ని వర్గాలు ఆయనకు ఓట్లు వేశాయి. కానీ అధికారంలోకి వచ్చాక బీసీలకు అన్యాయం చేశారు. 16 యూనివర్సిటీలలో వైస్‌ ఛాన్సలర్‌ అవకాశాలు ఉంటే కేవలం ఒక్క పోస్టు మాత్రమే బీసీలకు ఇచ్చారు. జగన్‌ దృష్టిలో నవరత్నాలు తప్పించి మరో అభివృద్ధి, సంక్షేమం గురించి ఆయనకు పట్టదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టింది. మా ప్రభుత్వం వచ్చాక ఇసుక పాలసీపై తగు నిర్ణయం తీసుకుంటుంది. బీసీ సంఘాల నాయకులు మళ్లీ వెనక్కి వచ్చి కూటమికి మద్దతు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. పిడుగురాళ్ల మాధవి మాట్లాడుతూ గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సాధికారత అంతకన్నా లేదు.

బీసీలను కులాల వారీగా విభజించిన కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే ఈ వైసీపీ ప్రభుత్వం వాడుకుంటుందన్నారు. మహమ్మద్‌ నశీర్‌ అహ్మద్‌ మాట్లాడుతూ చంద్రబాబు బీసీలకు పదవుల శాతాన్ని పెంచారు. కానీ జగన్‌ ప్రభుత్వం బీసీలను పదవుల కు, రాజ్యాధికారానికి దూరం చేసే విధంగా పాలన చేస్తుందన్నారు. ఈ పక్షపాత వైఖరిని ప్రతి ఒక్క బీసీ నాయకులు గుర్తించాలని కోరారు. రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యువజన అధ్యక్షుడు క్రాంతికుమార్‌ మాట్లాడుతూ ఈ వైసీపీ పెద్దలు బీసీలకు సంబంధించిన 56 కార్పొరేషన్లలో బీసీలకు నాయకత్వం అవకాశాలు కల్పిం చారా? ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి గురించి ఏ రోజైనా బయటకు వచ్చి ప్రశ్నించారా? ఈ రాష్ట్రంలో బీసీల్లోని 90 శాతం ఉన్న భవన నిర్మాణ కార్మికుల గురించి ఏ రోజైనా పట్టించుకుందా? బీసీలపై వేధింపుల గురించి వైసీపీ ప్రజలకు ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు అన్నవరపు నాగమ ల్లేశ్వరరావు, నిమ్మల శేషయ్య, బాతుగున్నల శ్రీనివాసరావు, మల్లె ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.