– మంత్రులకు మందకృష్ణ మాదిగ విజ్ఞప్తి
హైదరాబాద్, మహానాడు: ఎస్సీ వర్గీకరణపై భారత దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తెలంగాణ రాష్ట్రంలో త్వరితగతిన అమలుకు కృషి చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆధ్వర్యంలో అందుబాటులో ఉన్న రాష్ట్ర మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ను ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, మాదిగ సామాజిక వర్గానికి చెందిన శాసనసభ్యులు, సామాజిక వేత్తలు కలిసి విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర మంత్రులను కలిసిన వారిలో శాసన సభ్యులు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, వేముల వీరేశం, కాలే యాదయ్య, మందుల శామ్యూల్, ప్రొఫెసర్ మల్లేశం, ప్రొఫెసర్ ఖాసీం, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండేటి మల్లయ్య, విజయ్ కుమార్ ముంజగళ్ళ, బాపిరాజు, ఎమ్మార్పీఎస్ నాయకులు మేడి పాపయ్య మాదిగ, గోవింద్ నరేష్ లు ఉన్నారు.