మాచర్ల, మహానాడు: మాచర్ల మండలం నాగార్జున సాగర్‌లో పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ శుక్రవారం పర్యటించారు. ఎన్డీయే ప్రభుత్వం సాగర్‌లో నూతనంగా 1800 ఎకరాలల్లో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన నేపథ్యంలో కలెక్టర్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.కలెక్టర్ సాగర్‌లోని ఫ్లైటెక్ ఏవియేషన్‌కు చేరుకొని ఆ సంస్థ ఎండీ కెప్టెన్ మమత తో చర్చించారు. అనంతరం విమానాశ్రయం ఏర్పాటు కు కావాల్సిన భూములను పరిశీలించారు.