తిరుపతి : తిరుచానూరు పద్మావతి అమ్మవారిని విశాఖ శారదా పీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామిజీ, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామిజీ లు బుధవారం దర్శించుకున్నారు. వారికి ఆలయం వద్ద సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఇన్‌స్పెక్టర్ ప్రసాద్, ఎ.వి.ఎస్.వో.సతీష్‌కుమార్, అర్చకులు బాబు స్వామి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవా రి కుంకుమార్చన సేవలో పాల్గొన్న స్వామిజీలకు ఆలయాధికారులు అమ్మవారి కుంకుమ, వస్త్రం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.