– సీఎం చంద్రబాబుకు ఆర్‌ఆర్‌ఆర్ ఫిర్యాదు!
ఉండి, మహానాడు: ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్, ఇతరులపై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా రఘురాం కృష్ణంరాజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఫిర్యాదు చేశారు. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే, నాపై జరిగిన కస్టడీయల్ హింసపై, చర్య తీసుకోవాల్సిందిగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో సహా, పీవీ సునీల్ కుమార్, మరో ఐపీఎస్ సీతారామాంజనేయులు, సీఐడీ అధికారి విజయపాల్, డాక్టర్ ప్రభావతి(గుంటూరు జీజీహెచ్) నిందితులుగా ఫిర్యాదు చేయడం, ఆ ఫిర్యాదుపై ఎఫ్‌ఐఆర్ నమోదు అయింది. రాష్ట్ర హైకోర్టు సీఐడీ అధికారి విజయ పాల్ కు ముందస్తు బెయిలు నిరాకరించడం, పీవీ సునీల్ కుమార్ దర్యాప్తులో జోక్యం చేసుకుంటూ, బెదిరింపులకు పాల్పడుతుండడంతో ఈ కేసులో నిందితులను తక్షణమే కస్టడీలోనికి తీసుకోవాల్సిన అవసరం ఉందని, తక్షణమే న్యాయం చేయవలసిందిగా రఘురామ సీఎంకు అభ్యర్థించారు.