చంద్రబాబుపై ఫేక్ వీడియోతో వైసీపీ కుట్రలు
ఎన్నికల కమిషన్‌కు దేవినేని ఉమ ఫిర్యాదు
అమరావతి, మహానాడు : ఏఎన్‌ఐకు చంద్రబాబు ఇచ్చిన ఇంటర్వ్యూపై దుష్ప్రచారం చేస్తున్న వైసీపీ సోషల్ మీడియాపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆదివారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిట ీల రిజర్వేషన్లు రద్దు చేస్తామని చంద్రబాబు చెప్పినట్లు ఒక ఫేక్ వీడియోను తయారు చేసి వైసీపీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. కులాల మధ్య విభేదాలు సృష్టించి ఎన్ని కలకు ఒక్కరోజు ముందు రాజకీయ లబ్ధిపొందాలని వైసీపీ కుట్ర పన్నిందని పేర్కొన్నారు. తమకు అనుకూలంగా చంద్రబాబు మాటలను వక్రీకరించి వీడియో సృష్టించారని తెలిపారు. వైసీపీ సోషల్ మీడియా హెడ్ సజ్జల భార్గవ్‌రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని, ఈ నకిలీ వీడియోను ప్రసారం చేయకుండా ఎన్నికల సంఘం అడ్డుకోవాలని కోరారు.