Mahanaadu-Logo-PNG-Large

జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి

-ఎమ్మెల్యే గళ్ళా మాధవి

గుంటూరు, మహానాడు: గుంటూరు జిల్లాలో మొట్టమొదటి సారిగా జాబ్ మేళాను నిర్వహించబోతున్నామని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. శుక్రవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో మెగా జాబ్ మేళా బ్రోచర్ ను హెచ్ ఆర్ & కో ప్రతినిధులు, ఎన్డీయే కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షలకు అనుగుణంగా చదువుకున్న ప్రతి యువతకు ఉద్యోగం కల్పించటం లక్ష్యంగా పెట్టుకున్నామని ఎమ్మెల్యే తెలిపారు.

ఇందులో భాగంగా హెచ్ ఆర్ & కో కంపెనీ సహకారంతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నామని, విద్యార్హతతో సంబంధం లేని వ్యక్తి దగ్గర నుండి ఉన్నత చదువులు చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఉపాధి కలిపించటమే ఈ మెగా జాబ్ మేళా లక్ష్యమన్నారు. నిరుద్యోగులు తమ పేర్లను ఆన్ లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ఎన్డీయే కూటమి నేతలు తమ డివిజన్ లలో చదువుకున్న యువతను గుర్తించి, వారిని ఈ మెగా జాబ్ మేళాలో భాగ స్వామ్యం చేయాలన్నారు. ఈ మెగా జాబ్ మేళా కు రుసుము ఉండదని, సొంత ఖర్చులతో నిర్వహించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, కోవెలమూడి రవీంద్ర, వనమా నరేంద్ర, చెరుకూరి తిరుపతిరావు, తదితరులు పాల్గొన్నారు.