ప్రాసెస్ చేయొద్దన్న స్పెషల్ చీఫ్ సెక్రటరీ
రెవెన్యూ శాఖ అధికారులకు కీలక ఆదేశాలు
అమరావతి: కాంట్రాక్టర్లకు నిధుల విడుదలతో పాటు భూకేటాయింపుల ఫైళ్లను నిలిపి వేయాలని, కీలక ఫైళ్లను జాగ్రత్త పరచాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రెవెన్యూ శాఖ మంత్రి పేషీలోని రికార్డులు ఫైళ్లను జాగ్రత్త పరచాలని అధికారులను ఆదేశించారు. బదిలీ ఫైళ్లను కూడా నిలిపివేయాలని స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ సూచించారు.