ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతల పరిస్థితి గురించి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ దృష్టికి తీసుకువేళ్ళిన తెలుగుదేశం పార్టీ నేతలు. నేరాలను ప్రేరేపిస్తూ, నేరస్థులను వైకాపా పాలకులు కంటికి రెప్పలా కాపాడుతున్నారని గవర్నర్‌కు ఫిర్యదు చేశారు.
పోలీసు వ్యవస్థను ఉపయోగించుకుంటూ ప్రతిపక్షాలు ప్రశ్నించకుండా చూసుకుంటుంది. శేషాచలం అడవుల్లోనే దొరికే అరుదైన ఎర్ర చందనంను ప్రభుత్వమే స్మగ్లర్లతో సంబంధాలు పెట్టుకొని మాఫియాను ప్రేరేపింస్తుందని వారు ఆరోపించారు.
వైకాపా నేతల ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ను అడ్డుకున్న అన్నమయ్య జిల్లా చిన్నపల్లె గ్రామానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ కె. గణేష్‌ను సైతం ఎర్ర చెందనం మాఫియా కారుతో గుద్ది చంపారని వారు తెలియజేశారు.
ఎర్ర చందనం స్మగ్లరైన విజయనంద రెడ్డిని ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్‌గా నియమించటమే కాకుండా రానున్న సార్వత్రిక ఎన్నకల్లో చిత్తూరు నుంచి బరిలోకి దింపేందుకు అధికార పార్టీ ఆలోచిస్తుందని వారు అన్నారు. వైకాపా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో క్రైమ్ రేటు అధికంగా ఉంది. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడి, ఎర్ర చందనం మాఫియాకు బలైన కె.గణేష్ కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను వారు కోరారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన రావు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తదితరులు పాల్గొన్నారు.