పిన్నెల్లి హత్యకు పోలీసులతో టీడీపీ కుట్రలు

కారంపూడి విధ్వంసం వారిదే ప్రధాన హస్తం
పల్నాడు ఐజీ నేతృత్వంలోనే బరితెగించారు
మారణాయుధాలతో పచ్చమూకల దాడులు
ఆపకుండా ముందే వెళ్లిపోయిన పోలీసులు
హత్యాయత్నం చేస్తే వారిపై కేసులు పెట్టలేదు
వైసీపీ నేతల ఇళ్లు, షాపులే లక్ష్యంగా తెగబడ్డారు
ఎన్నికల సంఘం తీరు దుర్మార్గంగా ఉంది
జూన్‌ 4 తర్వాత అందరి ఆటలు సాగవ్‌
మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని

తాడేపల్లి, మహానాడు : వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం విలేఖరుల సమావేశంలో పార్టీ నాయ కుడు పేర్ని నాని మాట్లాడారు. కారంపూడి ఘటనకు టీడీపీతో కలిపి పోలీసులు కుట్రకు పాల్పడ్డారని ఆరోపించారు. కారంపూడిలో వైసీపీ నేతల ఇళ్లు, షాపులే లక్ష్యంగా పచ్చముఠా దాడులకు తెగబడిరదని, పోలింగ్‌ తర్వాత కూడా రెచ్చి పోయారన్నారు. విధ్వంసం చేస్తున్న పచ్చమూకలను నిరోధించకుండా పోలీసు అధికారులు బరితెగించి ప్రవర్తించారని మండిపడ్డారు. వైసీపీకి ఓటు వేయకుండా అడ్డుకున్నారు. కర్రలు, రాడ్లతో తరిమి తరిమికొట్టారు. టీడీపీ నేతలు హత్యాయ త్నం చేస్తే వారిపై కేసులు పెట్టలేదు. పాల్వాయి గేటులో విధ్వంసం జరిగితే పోలీసులకు ఏమాత్రం పట్టలేదు. పల్నాడు ఎస్పీ, ఇతర పోలీసు అధికారులకు పిన్నెల్లి ఫోనే చేసి చెప్పినా పట్టించుకోలేదు. పోలింగ్‌ ఆగినట్లు ప్రిసైడిరగ్‌ ఆఫీసర్‌ లాగ్‌ బుక్‌లో ఎక్కడా లేదు. పోలింగ్‌ రోజే ఎందుకు ఎఫ్‌ఐఆర్‌ కట్టలేదు. ఈవీఎం ధ్వంసం చేశారని ఈనెల 15వ తేదీన ఫిర్యాదు చేశారు. పోలింగ్‌ రోజు ఎందుకు ఫిర్యాదు చేయలేదు.

ఏసీపీ ఉన్నా చోద్యం చూశారు..

పాల్వాయిగేటు గ్రామంలో దాడులు జరుగుతున్నా ఏసీపీ సుప్రజ ఉండి కూడా చోద్యం చూస్తూ ఉన్నారు. ఆమె వాహనం కూడా అక్కడే కనిపించింది. టీడీపీ వారు కర్రలు, రాళ్లతో స్వైరవిహారం చేస్తున్నా పట్టించుకోలేదు. గొడవలను ఆపటా నికి ఆమె ప్రయత్నించలేదు. కనీసం కేసు కూడా నమోదు చేయలేదు. పిన్నెల్లి ధ్వంసం చేస్తున్నట్టు చూపిస్తున్న వీడియో ఎలా బయటకు వచ్చింది? నా ఆఫీసు నుంచి వెళ్లలేదని ఎన్నికల ప్రధాన అధికారి బాధ్యత లేకుండా మాట్లాడారు. ఉన్న తాధికారి అయి ఉండి మీరు మాట్లాడే భాష అలా ఉండచ్చా. ఎన్నికల వ్యవస్థకు తండ్రిగా వ్యవహరించాల్సిన మీరు..దున్నపోతు ఈనిందని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పగానే దూడని కట్టేయమని రాష్ట్ర ఎన్నికల అధికారి అంటున్నారని మండిప డ్డారు.

ఆమె చెప్పినట్లు ఆడారు

ఎస్సై, సీఐలు ఎక్కడా కూడా పిన్నెల్లి పేరు తేలేదు. ఈసీ నియామకంతో నియ మించిన అధికారులంతా టీడీపీ కోసం పనిచేశారు. ఒక పార్టీ అధ్యక్షురాలు బరితెగించి పిటిషన్‌ ఇస్తే ఆమె చెప్పినట్టు అధికారులను మార్చారు. ఒక అధికారి కుటుంబంలో ఎవరైనా రెడ్డి కులస్తులను చేసుకుంటే నిర్దాక్షిణ్యంగా మార్చారు. ఆమె తప్పుడు ఫిర్యాదులు ఇచ్చినందుకు ఈసీ నోటీసులు ఇవ్వాలి. కానీ ఆ పని చేయకపోగా ఆమె చెప్పిన అధికారులను నియమించారు. టీడీపీ నేతలు హత్యా యత్నం చేస్తే వారిపై కేసులు పెట్టలేదు.

ఎన్నికల సంఘం తీరు దుర్మార్గం

ఈనెల 21న పిన్నెల్లిని అరెస్ట్‌ చేయాలని ఈసీ ఆదేశించింది. డీజీపీకి అందిన సిట్‌ నివేదికలో పిన్నెల్లి పేరు ఎక్కడా ప్రస్తావన లేదు. లోకేష్‌ ట్వీట్‌ చేస్తే ఈసీ చర్యలకు ఆదేశిస్తుందా. కేంద్రం ఎన్నికల సంఘం వెంటనే ఎమ్మెల్యేని అరెస్టు చేయమని ఆదేశించింది. కోర్టులకు కూడా లేని అధికారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఉపయో గించాలని చూసింది. కేంద్ర ఎన్నికల సంఘం తొందర పాటు చర్యలకు దిగటం దారుణం. ఇదే విషయాన్ని ఎమ్మెల్యే పిన్నెల్లి తరపు లాయర్‌ కోర్టులో గట్టిగా వాదిం చి బెయిల్‌ తెచ్చుకున్నారు. అయినా ఏదో ఒక పాత కేసుల్లో ఎమ్మెల్యేను అరెస్టు చేయటానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. టీవీ చానల్స్‌లో చూసిన తర్వాతే ఎన్నికల కమిషన్‌ అధికారులు స్పందిస్తారా. ఈసీ కూడా దుర్మార్గంగా వ్యవహ రిస్తోంది. పోలీసుల తీరు దారుణంగా ఉంది.

మీ డ్రామాలు తెలియదా…పిన్నెల్లి హత్యకు కుట్ర పన్నారు

కారంపూడిలో విధ్వంసం చూస్తూ ఉండిపోయారు. సీఐ నారాయణస్వామికి గాయమైతే 10 రోజుల వరకు ఎందుకు స్టేట్‌మెంట్‌ ఇవ్వలేదు. సీఐకు గాయమైన పదిరోజుల తర్వాత ఎఫ్‌ఐఆర్‌ కడతారా? నాలుగో తేదీ దాకా మీ డ్రామాలు కుదు రుతాయేమో? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హత్యకు టీడీపీ తీవ్రంగా పనిచేస్తోంది. పిన్నెళ్లి హత్యకు పోలీసుల ద్వారా కుట్ర పన్నారు. అయ్యా టీడీపీ వాళ్లు నన్ను చంపేందుకు మాచర్ల వస్తున్నారని ఫోన్‌ చేసి ఎస్పీకి చెప్పుకుంటే ఉన్న సిబ్బందినే తొలగించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంటిముందు ఉన్న పారామిలిటరీ బలగా లను ఎందుకు తొలగించారు? రాష్ట్రపతి, గవర్నర్‌కు మొరపెట్టుకుంటేగానీ మళ్లీ పారామిలటరీ బలగాలను పంపారు. ఈ కుట్రకు సహకరిస్తున్న ప్రతి పోలీసు అధికారి ఖచ్చితంగా ఫలితం అనుభవిస్తారు. పల్నాడులో పోలీసు ఐజీ నేతృత్వం లోనే ఈ కుట్రలన్నీ జరుగుతున్నాయి. ఎల్లో మీడియాలో వార్తలు రాయగానే పోలీసులు, ఎన్నికల సంఘం అధికారులు చర్యలకు దిగుతున్నారు. నరసరావుపే ట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద హత్యాయత్నం కేసు పెట్టారు. టీడీపీ అభ్యర్థి అరవిందబాబు ఇంట్లో బాంబులు దొరికితే కేసు కూడా పెట్టకుండా వదిలేశారని ధ్వజమెత్తారు.