సత్తెనపల్లిలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

పాల్గొన్న టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ

పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు: సత్తెనపల్లి పట్టణం రఘురామ్‌ నగర్‌ ప్రజావేదికలో తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా మాజీ మంత్రి, సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ జెండా ఎగరవేసి అభిమానులకు, కార్య కర్తలకు, నేతలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, పట్టణ దళిత మైనారిటీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.