అదనపు కట్నం కోసం వేధిస్తున్న టీడీపీ నేత!

– సీపీకి ఒమ్మి సన్యాసిరావు కోడలు ఫిర్యాదు

విశాఖపట్నం, మహానాడు: విశాఖపట్నం యాదవ సంఘం అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ(టీడీపీ) నాయకుడు ఒమ్మి సన్యాసిరావు అదనపు కట్నం కోసం కోడలిని వేధిస్తున్నారు. ఈ మేరకు సన్యాసిరావు కోడలు రోహిణి గురువారం… తమకు రక్షణ కల్పించి, సత్వర న్యాయం చేయాలని విశాఖ సీపీని కలిసి వేడుకున్నారు. కోటి రూపాయల అదనపు కట్నం తేవాలని చిత్రహింసలు పెడుతున్నారని ఫిర్యాదు చేశారు.

ఒమ్మి సన్యాసిరావు వలన తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. “మామ గారి వేధింపుల వలన మా నాన్న బ్రెయిన్ స్ట్రోక్ కు గురయ్యారు.. అధికారం అండతో మమ్మల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు“ అని తానిచ్చిన ఫిర్యాదులో రోహిణి ఆరోపించారు. పైగా, తన క్యారెక్టర్ ను తప్పుగా చిత్రీకరిస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. ఆడపిల్ల పుట్టిందని అత్తింటికి రావొద్దంటున్నారు.. అని రోహిణి పోలీసులకు ఫిర్యాదు చేశారు.