వినుకొండ, మహానాడు: టెరిటోరియల్ ఆర్మీ 75 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో సైనిక సిబ్బంది దేశవ్యాప్త సైకిల్ ర్యాలీ చేపట్టారు. కాశ్మీర్ లోని సియాచిన్ బేస్ నుంచి మొదలైన ఆర్మీ సైకిల్ యాత్ర ఆదివారం వినుకొండకు చేరుకుంది. ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సూచనల మేరకు పట్టణంలోని 32 వ వార్డు కౌన్సిలర్ వాసిరెడ్డి లింగమూర్తి, మాజీ ఆర్మీ, తెలుగుదేశం పార్టీ(టీడీపీ) నేతలు వెంకట్రావు, శివశక్తి సిబ్బంది, గీతాంజలి విద్యాసంస్థల డైరెక్టర్ ఎండ్లూరి కిషోర్, తదితరులు ఆర్మీ సైకిల్ ర్యాలీ సిబ్బందికి స్వాగతం పలికారు.
ఆర్మీ సైకిల్ యాత్ర కాశ్మీర్ నుండి అండమాన్ నికోబార్ లోని ఇందిరా పాయింట్ కు చేరుకుంటుందని తెలిపారు. దేశ భద్రత రక్షణ ధ్యేయంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇండియన్ ఆర్మీ సైకిల్ యాత్ర చేపట్టిందని తెలిపారు. అండమాన్ నికోబార్ లో స్కోబా డ్రైవింగ్ చేస్తూ నీటి అడుగున జాతీయ పతాకాన్ని రెపరెపలాడిస్తామని సైనిక సిబ్బంది తెలిపారు. ఆర్మీ సైకిల్ ర్యాలీ సందర్భంగా సోమవారం వినకొండ లో భారీ ర్యాలీ జరగనుందని, ప్రజలందరూ పాల్గొనాలని కోరారు.