-ప్రమాణస్వీకార ఏర్పాట్ల పరిశీలన
-రాజేంద్రప్రసాద్‌కు పీఆర్ చాంబర్ సన్మానం
గన్నవరం: కేసరపల్లి గ్రామంలో చంద్రబాబు ప్రమాణస్వీకారం చేస్తున్న సందర్భంగా సభా వేదికను నందమూరి రామకృష్ణ, టీడీ జనార్దన్, వై.వి.బి.రాజేంద్ర ప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ కార్యక్రమానికి లక్ష మంది పైగా హాజరవుతారని, ఇబ్బందులు లేకుండా అన్ని రకాలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా, చిత్తూరు జిల్లా పంచాయతీరాజ్ చాంబర్ నాయకులు ఆయనను సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి వేరంకి గురుమూర్తి, సగర సాధికార రాష్ట్ర కన్వీనర్ జంపన వీర శ్రీనివాస్, మైనార్టీ సెల్ స్టేట్ సెక్రటరీ, బీసీ సెల్ స్టేట్ సెక్రటరీ రాజులపాటి ఫణి, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ నాయకులు బిర్రు ప్రతాప్‌రెడ్డి (కర్నూలు జిల్లా), చుక్కా ధనుంజయ యాదవ్ (చిత్తూరు జిల్లా), చింతకాయల ముత్యాలరావు (విశాఖ), ఎండి ఇస్మాయిల్ (అనంతపురం జిల్లా), డేగల కృష్ణమూర్తి (అనంతపురం), కుప్పాల మురళి (చిత్తూరు జిల్లా), వి.వి.చౌదరి (తూర్పుగోదావరి జిల్లా), కొప్పాల సుబ్బ య్య (కడప జిల్లా) తదితరులు పాల్గొన్నారు.