కారంపూడిలో టీడీపీ కార్యాలయం ధ్వంసం

కారంపూడి, మహానాడు : పోలింగ్‌ నేపథ్యంలో పల్నాడు జిల్లా కారంపూడి పట్టణం, కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామాల్లో తెలుగుదేశం, వైసీపీ శ్రేణులు పరస్పర దాడులకు దిగాయి. దీంతో మండలంలో ఉద్రికత్త వాతావరణం నెలకొంది. వాహనాలకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు.