‘ఉపాధ్యాయులు దైవ సమానులు’

గుంటూరు, మహానాడు: నేటి బాలలను రేపటి పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు అంకితభావంతో కృషి చేయాలని జిల్లా ప్రజా పరిషత్ ఛైర్ పర్శన్ కత్తెర హెనీ క్రిస్టినా పిలుపునిచ్చారు. ​గురువారం కలక్టరేట్ లోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవం – 2024 ను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొని, మాట్లాడారు.

ఉపాధ్యాయులు లేనిదే విద్య లేదని, విద్య లేని వాడు వింత పశువని, విద్య నేర్పిస్తున్న ఉపాధ్యాయులు భగవంతునితో సమానమని పేర్కొన్నారు. కార్యక్రమానికి శాసన సభ్యురాలు గళ్ళ మాధవి అధ్యక్షత వహించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యావేత్తగా , పారిశ్రామికవేత్తగా ఉప రాష్ట్రపతిగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉన్నారన్నారు.

తల్లిదండ్రుల తర్వాత అంతటి ఉత్తమ స్థానంలో ఉండేది గురువులేనని అన్నారు. కార్యక్రమం అనంతరం వరద బాధితుల సహాయార్ధం రూ.60,000/- ల చెక్కును యూటీఎఫ్ ప్రతినిధులు డీవోవో శైలజకు అందించారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయిన వారిని ఘనంగా సత్కరించారు.