మంగళగిరి, మహానాడు: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంలో గురువారం నేతలు ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి, ఘన నివాళులు అర్పించారు. అక్షరాలు నేర్పడంలో.. ఆదర్శాలు నింపడంలో గురువుల పాత్ర కీలకమన్నారు. సమజానికి ఉత్తమ పౌరులను అందించేది గురువులేనన్నారు. ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి.. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన మహోన్నత వ్యక్తి సర్వేపల్లి అని ఆయన సేవలను కొనియాడారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీ అశోక్ బాబు, మాజీ ఎమ్మెల్సీ ఏ.ఎస్ రామకృష్ణ, పార్టీ నాయకులు మన్నవ సుబ్బారావు, ఏ.వీ రమణ, పర్చూరి కృష్ణ, హాజీ హసన్ భాష, శంకర్ నాయుడు, బుచ్చిరాంప్రసాద్, ధారపనేని నరేంద్రబాబు, చెన్నుపాటి గాంధీ, చప్పిడి రాజశేఖర్, యామిని, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.