హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఫేక్ లోగోను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేసిన ఘటనపై హైదరాబా ద్ కమిషనరేట్ చిక్కడపల్లి పోలీసుస్టేషన్‌లో ఆర్టీసీ అధికారులు గురువారం ఫిర్యాదు చేశారు. కొణతం దిలీప్, హరీష్‌రెడ్డిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.