హైదరాబాదు, మహానాడు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఆదివారం తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ హైదరాబాదులో ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్చం అందించారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానంలో వసతి, దర్శనానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర శాసన సభ్యుల ఉత్తర్వులకు అర్హత కల్పించాలని మెమోరండం ఇచ్చారు.