Mahanaadu-Logo-PNG-Large

మేమంతా బాగున్నామని చంద్రబాబుకు చెప్పండి

• మంత్రి సవితతో పాత రాజరాజేశ్వరి పేట వాసులు
• మీ బాధ్యత మాది
• వరద బాధితులతో మంత్రి సవిత
• 56వ డివిజన్ లో పర్యటన
• ఇంటింటికీ వెళ్లి మందులు, ఆహారం పంపిణీ చేసిన మంత్రి

విజయవాడ : మా కోసం నడుంలోతు నీటిలో వస్తున్నారు. మేమంతా కోలుకున్నాం… బాగున్నాం… చంద్రబాబు బాగుండాలి…అని మంత్రి సవితతో పాత రాజరాజేశ్వరి పేట వాసులు తెలిపారు. ఇంటింటికీ వెళ్లిన మంత్రి సవిత…అన్ని అందుతున్నాయా..? అని రెండో లేన్ వాసులను అడిగారు. అన్ని అందిస్తున్నారని ఆనందం వ్యక్తంచేశారు. ఇవన్నీ ఎవరు అందిస్తున్నారని మంత్రి అడగ్గా…చంద్రబాబు ఇస్తున్నారని సమాధానమిచ్చారు. చంద్రబాబుకు ఏం చెప్పమంటారు అని అడగ్గా…మేమంతా బాగున్నామని తెలపాలని అక్కడి మహిళలు మంత్రితో తెలిపారు.

మీ బాధ్యత మాది అని వరద బాధితులకు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళిశాఖామాత్యులు ఎస్.సవిత భరోసా ఇచ్చారు. గురువారం విజయవాడ నగరంలోని 56వ డివిజన్ పాత రాజరాజశ్వేరిపేటలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత పాత రాజరాజశ్వేరిపేట మెయిన్ రోడ్డు, ఫస్ట్, సెకెండ్ లేన్లు, జ్యూడిషియల్ కాలనీలో ఇంటింటికీ వెళ్లి పాలు, వాటర్ బాటిళ్లు, ఆహార పొట్లాలు, మందులు పంపిణీ చేశారు.

జ్వరం, జలుబు వంటి రోగాలు ప్రబలకుండా ఆయుర్వేద మందులను అందజేశారు. వీటిని ఉదయం, రాత్రికి వాడాలని సూచించారు. శుక్రవారం నుంచి బియ్యం ఇతర నిత్యావసర సరకులు పంపిణీ చేస్తామని మంత్రి తెలిపారు. సీఎం చంద్రబాబు రేయింబవళ్లు వరద బాధితులను ఆదుకోడానికి పని చేస్తున్నారన్నారు.

ఇంటింటికి వచ్చి, ఆహారం, పాలు, వాటర్ బాటిళ్లు, పాలు అందజేస్తున్నామని, ఇంకొందరికి డ్రోన్లు, హెలీకాఫ్టర్లతోనూ పంపిణీ చేసేలా చంద్రబాబు చర్యలు తీసుకున్నారన్నారు. వాటర్ ట్యాంకులతో తాగునీటి అందిస్తున్నామన్నారు. ఆందోళన చెందొద్దని, మీ బాధ్యత మాది అని మంత్రి భరోసా ఇచ్చారు