విజయవాడ, మహానాడు: విజయవాడ ముంపు బాధితుల సహాయ కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన రాపిడ్ రెస్పాన్స్ టీమ్ తో పలువురు పార్టీ నేతలు కలిసి పనిచేస్తున్నారు. గుంటూరు నుండి జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయి కృష్ణ, ప్రత్తిపాడు శాసనసభ్యుడు బూర్ల రామాంజనేయులు వైఎస్ఆర్ కాలనీలోని చిట్టచివరి ప్రాంతాల్లోకి సైతం వెళ్ళి సేవలందిస్తున్నారు. ఈ సందర్భంగా రావిపాటి సాయి కృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్, పల్లా శ్రీనివాస్ ఆదేశాలతో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిరంతర పర్యవేక్షణలో గుంటూరు జిల్లా తెలుగుయువత సభ్యులు సహాయక కార్యక్రమాలు ముమ్మరం చేస్తున్నారన్నారు.