మంగళగిరి, మహానాడు: విపత్తుల్లో పార్టీ పిలుపుతో సహాయక కార్యక్రమాలు చేపట్టేందుకు ధైర్యంగా ముందుకొచ్చి సత్తాచాటి ప్రజలు కష్టాలలో భాగస్వామ్యం అవడం అభినందనీయమని గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు దుశ్శాలువతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది. సాయి కృష్ణ విజయవాడలో మూడు రోజులు పాటు ఉండి సహాయక కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. వరద నీటిలో సైతం 45, 47 డివిజన్లలో సేవలందించారు.