ఆల‌యాలు మానసిక ప్ర‌శాంత‌త‌కు నిల‌యాలు

– కేంద్ర పౌర విమాన‌యాన శాఖ మంత్రి కింజ‌రాపు రామ్మోహ‌న్‌నాయుడు
– బ‌ల‌గ‌లోని బాలాత్రిపుర సుంద‌రీ కాల‌భైర‌వ ఆల‌యాన్ని ద‌ర్శించుకున్న కేంద్ర‌మంత్రి, ఎమ్మెల్యే శంక‌ర్‌

శ్రీ‌కాకుళం: ఆల‌యాలు మాన‌సిక ప్ర‌శాంత‌త‌కు నిల‌యాల‌ని కేంద్ర పౌర విమాన‌యాన శాఖ మంత్రి కింజ‌రాపు రామ్మోహ‌న్‌నాయుడు అన్నారు. న‌గ‌రంలోని బ‌ల‌గ‌లోని బాలాత్రిపుర సుంద‌రీ కాల‌భైర‌వ ఆల‌యాన్ని ద‌ర్శించుకున్న కేంద్ర‌మంత్రి, శ్రీ‌కాకుళం ఎమ్మెల్యే గొండు శంక‌ర్‌లు గురువారం ద‌ర్శించుకున్నారు.

ఈ సంద‌ర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ నాగావ‌ళి న‌ది ఒడ్డున ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో ఆల‌య నిర్మాణం అద్బుతంగా ఉంద‌న్నారు. అమ్మ‌వారి ఆల‌యం దిన‌దినాభివృద్ధి చెందడం ఆనందంగా ఉంద‌ని, ఆల‌యానికి వ‌చ్చే భ‌క్తుల‌కు సౌక‌ర్యాల‌ను క‌ల్పించాల‌ని చెప్పారు. నేటి పోటీ ప్ర‌పంచంలో మ‌నుషులు ఒత్తిడిని త‌గ్గించుకునేందుకు ఆల‌యాల‌కు వ‌స్తుంటార‌ని వారి మాన‌సిక స్థితిని తెలుసుకొని వారిని స‌రైన మార్గంలో న‌డిచేలా ఆల‌య అర్చ‌కులు సూచ‌న‌లు చేయాల‌ని చెప్పారు.

ఆల‌యంలో నిర్వ‌హిస్తున్న గోశాల‌ను కేంద్ర మంత్రి ప‌రిశీలించి ఆల‌య నిర్వాహ‌కుల‌కు అభినందించారు. ఈ సంద‌ర్బంగా నిర్వ‌హించి అన్న‌దాన కార్య‌క్ర‌మంలో పాల్గొని భ‌క్తులు అన్న‌ప్ర‌సాదాన్ని అంద‌జేశారు. అనంత‌రం అమ్మ‌వారి మొక్కులు తీర్చుకుని గ‌ణేష్ గురూజీ వ‌ద్ద ఆశీస్సులు తీసుకున్నారు.శ్రీ‌కాకుళం ఎమ్మెల్యే గొండు శంక‌ర్ మాట్లాడుతూ కోరిన కోర్కెలు తీర్చే క‌ల్ప‌వ‌ల్లి బాలా త్రిపుర సుంద‌రీదేవి అని తెలిపారు. ఆల‌య క‌మిటీ అధ్య‌క్షులు రెడ్డి గిరిజాశంక‌ర్‌, తెలుగు యువ‌త జిల్లా అధ్య‌క్షులు మెండ దాసునాయుడు, టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, ఆల‌య సిబ్బంది, భ‌క్తులు అధిక సంఖ్య‌లో పాల్గొన్నారు.