– ఏపీలో తిరుమల పై దుష్ప్రచారం
– మండిపడ్డ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి
విజయవాడ, మహానాడు: వైసీపీ నేతలు అడుగుపెట్టిన ఆలయాల్లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో గో మూత్రంతో శుద్ధి చేశారు. లబ్బీపేట వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురు పాటి కుమార స్వామి, అడ్డూరి శ్రీరామ్, చైతన్య శర్మ, తదితరులు శుద్ధి చేశారు. ఈ సందర్భంగా కుమార స్వామి ఏమన్నారంటే… వైసీపీ నేతలు వెళ్ళిన దేవాలయాల్లో గోవింద నామస్మరణతో గో మూత్రంతో శుద్ధి చేశాం. హిందువులు మనోభావాలు దెబ్బ తినేలా జగన్ పాలన సాగింది.
నెయ్యి కల్తీ మొత్తం వారి హయాంలో సాగింది. ఇప్పుడు దెయ్యాలు వేదాలు వల్లించిన విధంగా ప్రక్షాళన అంటూ వైసీపీ రాజకీయం చేస్తోంది. అన్యమతస్తులకు తిరుమలపై అధికారాలను కట్ట పెట్టారు. క్రైస్తవ మతం తీసుకున్నావు .. తప్పు లేదు. కానీ హిందు సంప్రదాయాలను మంట కలిపే విధంగా పాలన చేశారు. నెయ్యి ని కల్తీ చేసి.. లడ్డూకి వాడి అపవిత్రం చేశారు. జగన్ చేసిన పాపాలు నేడు ఒక్కొక్కటి గా బయట పడుతున్నాయి. గోవులు కలుషిత ఆహారం తిని కలుషిత నెయ్యి ఇచ్చిందని వాగుతున్నారు.
గోమాత గడ్డి తిని పాలు ఇస్తే… అన్నం తినే వైసీపీ వారు మాత్రం విషం చిమ్ముతున్నారు. వైసీపీ వాళ్ళ రాజకీయాలు చూసి గోవులు కూడా కన్నీరు పెడుతున్నాయి. నీచమైన పనికి పాల్పడి.. కూడా ఇంకా ఆలయాల ప్రక్షాళన అనడం సిగ్గుచేటు. తప్పకుండా కల్తీ నెయ్యి ఘటన వెనుక ఎవరు ఉన్నా శిక్షించాలి. అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ.. ఐదేళ్ళ జగన్ పాలనలో తిరుమలను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారు. లడ్డూ తయారీలో నెయ్యి కల్తీ అనేది స్పష్టం. నేలకు ముక్కు రాసి జగన్, ఆనాటి టీటీడీ చైర్మన్ లు క్షమాపణ చెప్పాలి. తప్పు చేసి కూడా ఎదురుదాడి చేయడం సిగ్గుచేటు. మళ్ళీ ఆలయాల్లో కార్యక్రమాలు పేరుతో రాజకీయం చేయడం సిగ్గు చేటు. వాళ్ళు రాజకీయం కోసం ఆలయాలను కూడా అపవిత్రం చేశారు. మేం అదే ఆలయాల్లో శుద్ధి కార్యక్రమాలు చేశాం. ఇప్పుడు అయినా చేసిన తప్పు కు వారంతా స్వామి వారికి క్షమాపణ లు చెప్పాలి. కల్తీ నెయ్యి వ్యవహారంలో పాత్రధారులు ను కఠినంగా శిక్షించాలి.