కొడాలి నాని ఇంటి దగ్గర ఉద్రిక్తత

తెలుగుయువత ఆధ్వర్యంలో ఆందోళన
రాజకీయ సన్యాసం చేయాలని డిమాండ్‌
రాళ్లు, కోడి గుడ్లతో దాడికి యత్నం
అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదం
సహనం కోల్పోయిన సీఐ..
కాల్చేసుకుందామని ఆగ్రహం

గుడివాడ: ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానంటూ ప్రకటించిన నాని మాట నిలబెట్టుకోవాలంటూ తెలుగు యువత నాయకులు కొడాలి నాని ఇంటి దగ్గర పెద్దఎత్తున ఆందోళన చేశారు. ఈ సందర్భంగా తెలుగు యువత శ్రేణులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఒకానొక దశలో పరస్పరం కాల్చేసుకుండామని వన్‌టౌన్‌ సీఐ శ్రీనివాస్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు యువత నేత పొట్లూరు దర్శిత్‌ మండిపడ్డారు. పోలీసులను తోసుకుంటూ కొడా లి నాని ఇంటికి వెళ్లేందుకు యత్నించారు. అదే సందర్భంలో పోలీసులు, తెలు గు యువత శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కొడాలి నాని ఇం టిపై రాళ్లు, గుడ్లు విసిరారు. జై చంద్రబాబు అంటూ టపాసులు కాల్చారు. డౌన్‌ డౌన్‌ కొడాలి నాని అంటూ నినాదాలు చేశారు.

కౌంట్‌డౌన్‌ మొదలైంది: పొట్లూరి దర్శిత్‌

చంద్రబాబు సీఎం అయితే రాజకీయ సన్యానం చేస్తానని చాలెంజ్‌ చేశాడు. మాజీ ఎమ్మెల్యే నాని మాట నిలబెట్టుకోవాలి. శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చాం. దమ్ముంటే బయటికి రావాలి. బొచ్చు పీకుతారా అన్నావ్‌.. వచ్చి మాకు సమాధానం చెప్పాలని పొట్లూరి దర్శిత్‌ నిలదీశారు. అధికారం లేకుంటే నీ బతు కు కుక్కలు చింపిన ఇస్తరి. ఎవరొస్తారు రండి అని రెచ్చగొట్టావు. నీ బతుకుకు చంద్రబాబు అవసరం లేదు. తెలుగు యువత వస్తే ఇంట్లో దాక్కున్నావ్‌. టీడీపీని నామరూపాలు లేకుండా చేస్తానని ప్రగల్భాలు పలికావు. కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌ అయింది..ఇది ట్రైలర్‌ మాత్రమే…సినిమా ముందుంది.